‘తిప్పారామీసం’ సెన్సార్ పూర్తి..

524
sri vishnu
- Advertisement -

బ్రోచేవారేవరురా వంటి డీసెంట్ హిట్ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం “తిప్పారామీసం”. అసుర ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రం “తిప్పరా మీసం”.

Hero Sree Vishnu

ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ కి టెర్రిపిక్ రెస్పాన్స్ వస్తోంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం మ్యూజిక్ శ్రోతలని అలరిస్తుంది. నిక్కి తంబోలి హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సినిమాస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

THipparaa Meesam

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. క్రైం థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో శ్రీ విష్ణు గుబురు గడ్డంతో సీరియస్ లుక్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. గతకొంత కాలంగా శ్రీ విష్ణు సరైన విజయం అందుకోలేకపోయాడు. మరి ఈ చిత్రంతోనైనా హిట్‌ కొడతాడో చూడాలి.

- Advertisement -