అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణః జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్

473
M Dana Kishore IAS
- Advertisement -

గ్రైటర్ హైదరాబాద్ నగరంలో అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధుల నివారణకు జీహెచ్ ఎంసీ ప్రత్యేక కార్యచరణ ప్రణళికను రూపొందించిందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్. జిహెచ్ఎంసి పరిధిలో ప్రత్యేకంగా 500 ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జూలై 20 వ తేదీలోగా హెల్త్ క్యాంపు ల నిర్వహణతోపాటు నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమల నివారణకు స్ప్రేయిన్ ను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు ఆరు వేలకు పైగా పాఠశాలల్లో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈసారి ప్రత్యేకంగా 500లకు పైగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో మెదడువాపు వ్యాధి ప్రబలంగా ఉండడంతో, మెదడు వాపు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. . ముఖ్యంగా హై రిస్క్ ప్రాంతాల్లో, గతంలో నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు వస్తే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

- Advertisement -