పాల పదార్థాలలో నెయ్యిని చాలమంది ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు. వివిధ వంటలలోనూ, స్వీట్స్ తయారీలోనూ నెయ్యి ఉపయోగిస్తుంటారు. దీనిని వాడడం వల్ల గుమగుమలాడే సువాసనతో పాటు చక్కటి రుచి కూడా లభిస్తుంది. ఇంకా ఆయా పదార్థాలలో నెయ్యి ఉపయోగించడం వల్ల శరీరానికి కూడా ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. ఇందులో విటమిన్ ఏ, డి, ఇ, కె వంటి వాటితో పాటు కాల్షియం, ఐరన్, బ్యూట్రిక్ యాసిడ్ వంటి పోషకాలు కూడా అందుతాయి. అయితే నెయ్యికి ఉండే వాసన కారణంగా కొంతమంది దీనిని తినడానికి అలెర్జీగా ఫిల్ అవుతుంటారు. అలా అలెర్జీగా ఫిల్ అయ్యే వారు ఇతర పదార్థాలతో కలుపుకొని నెయ్యిని తినవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కాల్చిన డ్రై ఫ్రూట్స్ తో కలిపి నెయ్యిని తినడం వల్ల శరీరానికి మరిన్ని ఉపయోగాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. .
డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అందువల్ల వీటిని నెయ్యితో కలిపి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడం, జీర్ణ శక్తి పెరగడం.. వంటి లాభాలు కలుగుతాయట. ముఖ్యంగా తక్షణ శక్తిని అందించి ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. నెయ్యిలో ఉండే ఆరోగ్య కరమైన కొవ్వులు అలాగే డ్రై ఫ్రూట్స్ లో ఉండే ప్రోటీన్లు మిళితమై కండర బలాన్ని పెంచుతాయి. ఇంకా మెదడు పని తీరును మెరుగు పరిచి ఏకాగ్రత ఆలోచన శక్తిని పెంచడంలో కూడా సహాయ పడుతుందట. ఇంకా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కలిపి తినడం వల్ల శరీరానికి తక్కువ కెలోరీలు అందుతాయి. అందువల్ల బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నెయ్యిని నేరుగా తినలేని వారు ఇలా డ్రై ఫ్రూట్స్ తో కలిపి తినడం మంచిది.
Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!