ఆరోగ్యాన్నిపెంచే.. ఆహారపు అలవాట్లు!

208
- Advertisement -

నేటి రోజుల్లో గుండెకు సంబంధించిన సమస్యలతో చాలమంది భాదపడుతున్నారు. ముఖ్యంగా గుండెపాటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో డాక్టర్లు కూడా గుండె సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే గుండె సమస్యలు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో తగు జత్రత్తలు పాటించకపోవడం వల్లే హార్ట్ సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి అలవాటు పడడం, చక్కెర శాతం అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం, మానసిక ఒత్తిడి, శారికక శ్రమ లేకపోవడం, ఇలా చాలా కారణాలు హార్ట్ సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు పాటిస్తే గుండె సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని వైద్య నిపుణుల సూచన.

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి, లవంగాలు, జీలకర్ర వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తనాలల్లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయి. ఇంకా ఆకుకూరలు రోజు తినడం అలవాటు చేసుకోవాలి.. ఎందుకంటే ఆకుకూరాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఓ,ఇంకా వాల్ నాట్స్, ఓట్ మిల్, తాజా పండ్లు, కూరగాయలు, బీన్స్, తృణ ధాన్యాలు, బ్రోకోలి, గుమ్మడి గింజలు, టమాటో వంటివి రోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నారింజ, సీతాఫలం వంటివి గుండె సమస్యలను దూరం చేయడంలో ఎంతో కీలకం.. నారింజలోని బేటా కేటోరిన్, సీతాఫలంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో పైన చెప్పినవన్నీ ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

వీటితో పాటుగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ కూడా ఎంతో అవసరం.. అందుకే ప్రతిరోజూ వ్యాయామం, యోగా వంటివాటికి సమయం వెచ్చించాలని నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -