గని..రిలీజ్ డేట్ ఫిక్స్!

70
ghani
- Advertisement -

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం ‘గని’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ కంపెనీ, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది.. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తికాగా పలుమార్లు విడుదల తేదీ వాయిదాపడగా తాజాగా సినిమా డేట్‌ని అనౌన్స్‌ని చేశారు మేకర్స్‌. ఫిబ్ర‌వ‌రి 25 లేదా మార్చి 4న కానీ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ రెండు తేదీల్లో అనుకూల‌మైన తేది రోజున గ‌ని చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ఈ సినిమా కోసం వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సిక్స్ ప్యాక్ పెంచారు. బాక్సింగ్‌ ప్రొఫెష‌న‌ల్‌గా క‌నిపించాల‌నే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి మ‌రీ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ కూడా తీసుకున్నారు.

- Advertisement -