గోపిచంద్ మూవీకి నో చెప్పిన రాజశేఖర్!

59
gopichand
- Advertisement -

శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కాగా గోపిచంద్‌కు 30వ సినిమా. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో రాజశేఖర్ కీరోల్ పోషిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రాజశేఖర్ క్విట్ అయ్యారని టాక్‌. తన పాత్ర నచ్చక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా? లేక.. సెట్స్ కు లేట్ గా వస్తున్నారన్న కారణంతో నిర్మాతలే తప్పించారా? అన్నది తెలియడం లేదు. రాజశేఖర్ స్ధానంలో జగపతిబాబు నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

గోపీచంద్, శ్రీవాస్ కాంబోలో మొదటి చిత్రం ‘లక్ష్యం‌’లో జగపతి బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, గోపీకి అన్నగా నటించిన సంగతి తెలిసిందే. అలాగే.. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ‘సాక్ష్యం’ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించారు. తాజాగా జగపతిబాబునే ఎంపికచేస్తారో లేదా మరెవరినైనా తీసుకుంటారా వేచిచూడాలి..

- Advertisement -