జార్జ్ క్రిష్ ..’ఫస్ట్ బూస్టర్’ అదుర్స్‌!

1
- Advertisement -

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మాస్ ఎంటర్‌టైనర్ల దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘జార్జ్ క్రిష్’ (George Krish). ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా ‘ఫస్ట్ బూస్టర్’ పేరిట ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ చిత్రంలో శర్వానంద్ ‘జార్జ్’, ‘క్రిష్’ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచారు. శ్రీనువైట్ల తనదైన మార్క్ వినోదం, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ పండగ సీజన్‌కు సరిగ్గా సరిపోయే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read:దానం నాగేందర్‌కు సుప్రీంలో షాక్

- Advertisement -