నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ..

217
Election comission of india
- Advertisement -

ఎప్రిల్ 11న మొదటి విడత సార్వత్రిక ఎన్నికలు జరుగనున్ననేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇవాళ ఉదయం 10గంటల నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలించగా.. 27, 28 రెండు రోజుల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.. రెండు రాష్ట్రాల్లో దాదాపు 7 ల‌క్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌నున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలేట్ పై అవ‌గాహ‌న ఈ నెల‌ 28 నుంచి 31 వ‌ర‌కు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు జిల్లా కలెక్టరేట్‌లో, మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, చేవెళ్లకు రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించి మే 23న ఫలితాలు విడుదల చేస్తారు.

- Advertisement -