- Advertisement -
విశాఖలో జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. 10వేల ఉద్యోగాలు కల్పించేలా ANSR సంస్థతో ఎంఓయు చేసుకుంది ఏపీ సర్కార్. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్..జిసిసి, ఐటి రంగాల్లో 5లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం అన్నారు.
ఏడాదిలోనే గ్లోబల్ ప్లేయర్ లను ఆకర్షించడం మా తొలి విజయం అని తెలిపారు. జీసీసీ గ్లోబల్‍లీడర్లతో కలిసి రోడ్‍షో నిర్వహించారు లోకేశ్. ఏఐ, క్యాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
Also Read:వీరమల్లు… తమిళ రైట్స్!
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని .. ప్రపంచం ఏపీ వైపు చూస్తోంది అన్నారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్యాంటమ్ వ్యాలీ రానుందన్నారు.
- Advertisement -

