ఐపీఎల్ 10లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోరు సాధించింది.కొంతకాలంగా ఫామ్‌లో లేకుండా ఇబ్బంది పడుతున్న గేల్ విశ్వరూపం….కోహ్లి, జాదవ్ మెరుపులతో ఆర్సీబీ భారీ టార్గెట్‌ను గుజరాత్ ముందు ఉంచింది. తొలుత టాస్ గెలిచిన గుజరాత్…బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గాయం కారణంగా ఏబీ డివిలియర్స్ జట్టుకు దూరం కావడంతో తుదిజట్టులోకి వచ్చిన గేల్ మరోసారి తనవిశ్వరూపం చూపించాడు.
కోహ్లీతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన గేల్ తొలుత నెమ్మదిగా ఆడిన తర్వాత తనదైన శైలీలో రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఈ క్రమంలో టీ20ల్లో అరుదైన ఘనతను గేల్ సొంతం చేసుకున్నాడు. 10వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఆటగాడిగా అరుదైన రికార్డును సాధించాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఫార్మాట్‌లో ఏకంగా 18 శతకాలు బాదాడు.
కేవలం 38 బంతుల్లో 7 సిక్సర్లు,5 ఫోర్ల సాయంతో 77 పరగులు చేసి వెనుదిరిగాడు. గేల్‌కు తోడుగా కెప్టెన్ విరాట్ సైతం 50 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 122 పరుగులు జోడించారు. వీరిద్దరు ఔటైన తర్వాత వచ్చిన హెడ్,జాదవ్ బెంగళూరు 200 పరుగుల మార్క్ దాటడంలో కీలకపాత్ర పోషించారు. జాదవ్ 16 బంతుల్లో 38 పరుగులు చేయగా హెడ్ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు.