తమిళనాట నయా ట్విస్ట్: పార్టీ నుంచి శశికళ ఔట్

262
Sasikala Kept Away
- Advertisement -

తమిళనాట రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే చీలికవర్గంతో సంధి కుదుర్చుకోవటమే లక్ష్యంగా 25 మంది రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెన్నైలో సోమవారం రాత్రి అత్యవసర సమావేశం జరిపారు. వీరందరూ శశికళ గ్రూపునకు (అన్నాడీఎంకే అమ్మ పార్టీ) చెందినవారు. పార్టీపై శశికళ, ఆమె బంధువుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వీరు వ్యూహం రూపొందించారు.

సమావేశం తర్వాత మంత్రి డీ జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఐక్యంగా ముందుకు ఉంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పార్టీ నుంచి శశికళతో పాటు దినకరన్‌ను తొలగిస్తున్నట్ల సంచలన ప్రకటన చేశారు. ఇది ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. పార్టీని నడిపించేందుకు కమిటీ వేశామని శశికళ కుటుంబం నుంచి పార్టీని కాపాడుకుంటామని తెలిపారు. అమ్మ జయలలిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యమని ప్రకటించారు.

- Advertisement -