కొబ్బరిమట్ట..మిలియన్ వ్యూస్‌

225
Kobbari Matta Million VIews
- Advertisement -

టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే ఎక్క‌డ లేని ఇమేజ్ సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్‌ బాబు. హృద‌య‌ కాలేయం, సింగం 123 సినిమాల‌తో డిఫ‌రెంట్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బర్నింగ్‌ స్టార్‌కు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అటు సైడ్‌ క్యారెక్టర్స్‌ మరోవైపు హీరోగా బిజీగా ఉన్న సంపూ తాజాచిత్రం కొబ్బ‌రిమ‌ట్ట‌. కొద్ది రోజులుగా టీజ‌ర్ల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న కొబ్బ‌రిమ‌ట్ట ఇప్పుడు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో అంద‌రికి షాక్ ఇస్తోంది.  రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆది కుంభగిరి, సాయి రాజేష్‌ నీలం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Sampu .. Kobbari Matta latest news

ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌తోనే  టాలీవుడ్ లాంగెస్ట్ టీజ‌ర్ గా రికార్డు నిలిచిపోవ‌ట‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో రికార్డుల వ‌ర్షం కురిపించింది. ఇప్పుడు డైన‌మిక్ ద‌ర్శ‌కుడు , అంద‌రి డార్లింగ్ ద‌ర్శ‌కుడు పూరిజ‌గన్నాథ్ చేతుల మీదుగా కొబ్బ‌రిమ‌ట్ట చిత్రం నుంచి శంభో శివ శంభో సాంగ్ టీజ‌ర్ ని విడుదల చేశారు. సోషల్ మీడియాలో తెగ ట్రెండైంది. ఇప్పటివరకు మిలియన్ వ్యూస్ సంపాదించి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో సంపూ ఇంకెన్ని సంచలనాలు చేస్తాడో చూడాలి.

- Advertisement -