‘గాయత్రి’ ఆడియో లాంచ్..

333
- Advertisement -

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ని తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈమూవీకి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘‘చాలా కష్టమైన వ్యాపారం సినిమా. జయాపజయాలు దైవాధీనం. మాకు తెలిసిన ఫీల్డ్‌ ఇదొకటే. మాకు తెలిసిన వ్యాపారం ఇదే. నటుడిగా, నిర్మాతగా మాకు మరో వ్యాపకం లేదు. మా బ్యానర్‌లో దాదాపు 60కు పైగా సినిమాలు తీశాం.

విజయం వచ్చినప్పుడు విర్రవీగలేదు. అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఎంత అణిగి మణిగి, సౌమ్యంగా, పద్ధతిగా ఉంటే భగవంతుడు అంత ఆశీర్వాదం ఇస్తాడు. అయిదు సినిమాలు హిట్టయి ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితే.. అయిదు సినిమాల హిట్టూ పోతుంది. నిర్మాత పని ఎంత కష్టమో మీకు తెలియదు. మా గురువు దాసరి నారాయణరావు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు. ఆయన ఇచ్చిన పాత్రలు, పలికించిన సంభాషణలు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ‘ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో డైలాగ్‌లు పలికే వ్యక్తి మోహన్‌బాబు’ అంటూ పేరు వచ్చిందంటే ఆ గొప్పదనం అంతా మా గురువు దాసరి నారాయణరావు గారిదే. ఈ సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డాం.

Gayathri Movie Audio Launch

నా వైఫ్‌ నన్ను ‘బావా’ అని పిలుస్తుంటుంది. కానీ, ఈ మధ్యన పిలవడం లేదు. ఎందుకంటే సక్సెస్‌ లేదు కదా! సక్సెస్‌ లేకపోతే ఎవరూ పిలవరు. నువ్వు(అనసూయ) నన్ను బావా అని పిలిచావా? పిలిచే ఉంటావ్‌ లే! అనసూయ గురించి రోజూ నాకు కంప్లయింట్‌లే. ప్రతీ సినిమాకు ఎవరితో ఒకరితో గొడవ ఉంటుంది. కానీ, ఈ సినిమాకు చాలా కంట్రోల్‌ చేసుకున్నా.. ఎవరినీ ఏమీ అనకూడదని. ఇక్కడ మనందరం కూలి వాళ్లం. అనసూయ గురించి అప్పుడప్పుడు కంప్లయింట్లు చెబుతుండేవాళ్లు. కానీ నేను పట్టించుకోలేదు. ‘అనసూయ చాలా మంచి అమ్మాయి’ అని విష్ణు చెప్పాడు. ఈ ఫంక్షన్‌కి నిన్ను(అనసూయ) పిలవాలనుకోలేదు. విష్ణు మనిద్దరినీ కలిపాడు. అన్నారు.

దర్శకుడు మదన్‌ మాట్లాడుతూ.. ‘‘2017 నా జీవితంలో ఒక గొప్ప సంవత్సరం. మోహన్‌బాబుగారిది అరుదైన వ్యక్తిత్వం. ‘సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు’ ఇది తప్పా? ఒప్పా? అంటే అందరం రైట్‌ అంటాం. కానీ, ‘ఏ దిక్కున సూర్యుడు ఉదయిస్తాడో అదే తూర్పు’ అంటారు మోహన్‌బాబు. ఆయన దగ్గర అంత స్పష్టత ఉంటుంది. ఆయన కోపం పాలపొంగులాంటిది. మనుషులను చదివిన వాడు వేదాంతి అయినా అవుతాడు. వ్యాపారి అయినా అవుతాడు. లేకపోతే మోహన్‌బాబులాంటి గొప్ప నటుడైనా అవుతాడు. ఒక నటుడికి కావాల్సింది అర్థం చేసుకోవడం. ఆయన సెకనులో వెయ్యోవంతు సమయంలోనే అంతా అర్థం చేసుకుంటారు. చాలా గొప్ప వ్యక్తి’’ అని అన్నారు.

- Advertisement -