28న గోపిచంద్…. ‘గౌతమ్ నంద’

215
Gautham Nanda Releasing On July 28
- Advertisement -

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది. గోపీచంద్ సరసన హన్సిక, కేతరీన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

Gautham Nanda Releasing On July 28
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లాడుతూ.. “నిజానికి చిత్రాన్ని జూలై రెండో వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామనుకొన్నాం. కానీ.. సీజీ వర్క్ కారణంగా లేటయ్యింది. ఇప్పుడు జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. గోపీచంద్ స్టైలిష్ లుక్స్, సంపత్ నంది స్టైలిష్ టేకింగ్, టీజర్ మరియు పోస్టర్ కు విశేషమైన స్పందన లభిస్తుండడంతో సినిమాను కూడా అంతకుమించిన స్థాయిలోనే ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అన్నారు.

గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!

Gautham Nanda Releasing On July 28

- Advertisement -