గోపిచంద్ .. ‘గౌతమ్‌ నందా’ ఫస్ట్ లుక్‌

202
Gautam Nanda FirstLook
- Advertisement -

లాంగ్ గ్యాప్‌ తర్వాత టాలీవుడ్‌లో బిజీగా మారిన హీరో గోపిచంద్. ఇటీవలె ఆక్సిజన్‌ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న గోపిచంద్ మరోసినిమాను పట్టాలెక్కించాడు.  సంపత్ నంది దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేయబోతునట్లు సమాచారం. ఇప్పటివరకు గోపిచంద్ డ్యూయల్ రోల్స్ లో కనిపించిందే లేదు. మొదటిసారిగా ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. దీనికోసం దర్శకుడు సంపత్ కథ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడట.

Gautam Nanda FirstLook

తొలుత ఈ చిత్రానికి బలం అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే హృతిక్ రోషన్ తన కాబిల్ చిత్రాన్ని బలం పేరుతో తెలుగులో  విడుదల చేయటంతో ఈ సినిమా పేరును గౌతమ్ నందాగా ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు.  గౌతమ్ నందా అనేది అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ పేరు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో గోపిచంద్ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తు సినిమాపై అంచనాలను పెంచేశాడు.

ఇక గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్” షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. .గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.

- Advertisement -