భారీగా పెరిగిన బంగారం ధరలు..

214
gold price

రెండురోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. బుధవారం బంగారం ధరలు బారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.49,520కి చేరింది.

అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగి రూ.54,020కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. ఏకంగా కిలో వెండి ధర రూ.1200 పెరిగి రూ.69,500కి చేరింది.అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లలో కూడా పెరిగాయి.