పవన్ ఖేరాకు హైకోర్టు షాక్!

6
- Advertisement -

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ దాఖలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గౌహతి హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ పార్థివజ్యోతి సైకియా ఉత్తర్వులు జారీ చేశారు.

అసోం ముఖ్యమంత్రి భార్య రినికి భుయాన్ శర్మకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్టులు ఉన్నాయని, ఆమె పలు దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పవన్ ఖేరా ఆరోపించారు.పవన్ ఖేరా ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ, రినికి భుయాన్ శర్మ ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు ఏప్రిల్ 6న ఆయనపై కేసు నమోదు చేశారు.

పవన్ ఖేరా తన నివాసం హైదరాబాద్‌లో ఉందని చూపుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 10న ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. అయితే, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణ పరిధి అసోం కోర్టులకే ఉంటుందని, అక్కడే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పవన్ ఖేరాకు సూచించింది.

సుప్రీంకోర్టు సూచన మేరకు పవన్ ఖేరా గౌహతి హైకోర్టును ఆశ్రయించగా, వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.కోర్టు తీర్పుతో బీజేపీకి రాజకీయంగా అస్త్రం దొరికినట్లయింది. పవన్ ఖేరా తన ఆరోపణల కోసం వాడిన పత్రాలు ఫోర్జరీ చేసినవని, అవి ఫేక్ మరియు ఏఐ (AI) ద్వారా సృష్టించినవని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. కాంగ్రెస్ కావాలనే అసోం సీఎం మరియు ఆయన భార్యపై రాజకీయ ప్రేరేపిత ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. గౌహతి హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో, పవన్ ఖేరా తదుపరి చర్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

- Advertisement -