ఎన్నికల్లో పోటీకి దూరమై కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీ కి మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించారు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గట్టు రామచంద్రరావు….షర్మిల రాజశేఖర్ రెడ్డి పేరును చెడగొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో నిలబడతా అని చివరగా అందరిని రోడ్డు మీద నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్ని రోజులు షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామన్నారు. మేమంతా షర్మిలను తెలంగాణ నుండి బహిష్కరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలంటే షర్మిలకు చిన్నచూపు అని…షర్మిల రాజకీయాలకు పనికిరాదన్నారు. భవిష్యత్ కార్యచరణ త్వరలోనే చెబుతాం అన్నారు.
Also Read:ప్చ్.. పవన్ మరో కేఏ పాల్ అవుతారా?
వైఎస్సార్ అభిమానులను షర్మిల మోసం చేసిందన్నారు సత్యవతి. మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము అంటే పార్టీలో చేరాను పాదయాత్రలో పాల్గొన్నానని..వైఎస్సార్ కార్యకర్తలు అందరూ అభిమానంతో పార్టీలో చేరారు అందరిని షర్మిల మోసం చేసిందన్నారు. షర్మిల ఎవర్ని గౌరవించలేదు సొంత ఎజెండా తో ముందుకు వెళ్లిందన్నారు. పాదాల మీద కాదు మా అందరి శవాల మీద నడిచేందుకు సిద్ధమైందనన్నారు.
బయ్యారం గుట్టను దోచుకోవడానికి వచ్చిన షర్మిల ఖబర్దార్ అన్నారు గణేష్ నాయక్. తెలంగాణ లో ఎన్నో డ్రామాలు నడిపింది షర్మిల అని చివరకు కాంగ్రెస్ తో కుమ్మక్కైందని మండిపడ్డారు బి సంజీవ రావు.షర్మిలకు తెలంగాణ లో తిరిగే హక్కు లేదన్నారు.
Also Read:జుట్టు రాలిపోతోందా..ఈ చిట్కాలు మీకోసమే!