ప్చ్.. పవన్ మరో కేఏ పాల్ అవుతారా?

29
- Advertisement -

ఆ పవనుడి గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకోవాలి. రాజకీయం అంటే విలువలు ఉండాలి అని చెప్పిన ఈ పెద్ద మనిషే నేడు విలువలు లేని వ్యక్తిగా మారుతున్న విధానాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏపీలో తెలుగు దేశంతో పొత్తు.. తెలంగాణలో బీజేపీతో పొత్తు. ఏమిటి ఈ విచిత్రం ?, దీనికి హద్దులు లేవా ?, బీజేపీ – తెలుగుదేశం పార్టీలు నేటికీ వ్యతిరేఖంగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్కో చోట ఒక్కో పెళ్లి చేసుకున్నట్లు ఉంది. పోనీ ఉపయోగం ఉందా ?, భారీ ప్రయాస తప్ప ఇంకేం మిగిలేలా కనబడటం లేదు. పవన్ రాజకీయాల కథ ఖతం అని ఆయన అభిమానులే పలికిన పలుకులు ఆ పవనుడికి వినిపించేది ఎన్నడూ ?.

మొత్తానికి బీజేపీ ఈసారి చాలా వ్యూహాత్మకంగా, స్టబ్బరన్‌గా ఉంది., నిజానికి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏకంగా 25 సీట్లు అడిగినా కొన్నాళ్లు నాన్చీ నాన్చీ ఇక సైలెంట్ అయిపోయింది… పేరుకు సహభాగస్వాములే, ఐనా డోన్ట్ కేర్ అంది బీజేపీ. చివరకు ఇచ్చింది పుచ్చుకుని పవన్ మద్దతు ఇచ్చాడు. నేడు అవమానించిన బీజేపీ పంచన చేరినప్పుడు, అనివార్యం అని చెప్పి రేపు తెలుగుదేశం పంచన ఎందుకు చేరడు ?. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏపీలో పోటీచేయనిచోట్ల ఇక టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతు పలకాల్సిందే.

గతంలో రాష్ట్రం మొత్తమ్మీద పోటీచేస్తామని ప్రకటించి, టికెట్లు కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించి, చివరకు తెలుగుదేశంకు పవన్ కళ్యాణ్ బేషరతు మద్దతు ప్రకటించాడు. అంతకు మించి పవన్ కి వేరే దారి కూడా తోచడం లేదు. అసలు పవన్ పార్టీ పుట్టుకే లోపం… ఆయన నటుడు. హఠాత్తుగా రాజకీయవాది ముసుగేసుకున్నాడు. జనం నవ్వుకున్నారు… భారీగా సమయాన్ని ఖర్చు పెట్టాడు. కొన్ని సార్లు ఊరూరూ తిరిగాడు. ఏం జరిగింది..? పవన్ ను ఎవరూ నమ్మలేదు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలవలేకపోతే.. పవన్ మరో కేఏ పాల్ అయినట్టే.

Also Read:కోట బొమ్మాళి పీఎస్‌..చాలా సంతృప్తినిచ్చిన కథ

- Advertisement -