ఘట్టమనేని గౌతమ్‌ బర్త్‌డే..శుభాకాంక్షల వెల్లువ

277
gg
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ 14వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మహేశ్‌ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పాత జ్ఞాపకాలని షేర్ చేస్తూ గౌతమ్‌ చిన్న-పెద్ద నాటి ఫోటోను షేర్ చేస్తూ స్పెషల్ గ్రీటింగ్ తెలిపారు.

మంచి వ్య‌క్తిత్వం ఉన్న కుర్రాడిగా నువ్వు పెరిగి పెద్ద‌గా అవుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డొరేమాన్ టు అపెక్స్ లెజెండ్ వ‌ర‌కు నీతో క‌లిసి నేను జ‌ర్నీ చేయ‌డం హ్యాపీగా ఉందని పేర్కొన్నారు మహేశ్. నీకిది గొప్ప పుట్టిన‌రోజు కావాలి..హ్యాపీ బ‌ర్త్ డే జీజీ(ఘట్టమనేని గౌతమ్‌) అని పేర్కొన్నారు.

నువ్వు మా జీవితాల్లోకి వ‌చ్చాక ఎంతో మార్పు వ‌చ్చింది. సంతోషం, ప్రేమ‌ను తెచ్చావు. ప్ర‌తి ఏడాది ఇలానే జీవితంలో ప్రేమ‌, సంతోషం పెరుగుతూ రావాలని తెలిపారు నమ్రత. వీరితో పాటు పలువురు సెలబ్రెటీలు నమ్రతకు విషెస్ తెలిపారు.

- Advertisement -