యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ హీరో తరవాత విజయానికి దూరమైపోయారు. రాజశేఖర్ పనైపోయింది అనుకుంటున్న తరుణంలో పీఎఎస్‌వి గరుడవేగ అంటూ సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ:
శేఖర్ ( రాజశేఖర్ ) నిజాయితీ కలిగిన ఎన్‌ఐఏ అధికారి. డ్రగ్స్, అక్రమ ఆయుధాలకి సంబంధించిన కేసుల విచారణలో బిజీ గా ఉంటాడు. దీంతో తనకి సరైన సమయం కేటాయించడం లేదని ఆయన భార్య స్వాతి ( పూజ కుమార్ ) రగిలిపోతుంటుంది. ఇలాంటి సమయంలో శేఖర్ కి ఓ ముఖ్యమైన కేసు ఇన్వేస్టిగేషన్ చేసే పనిలో బిజీగా ఉంటాడు శేఖర్. ఈ క్రమంలో అనూహ్యమైన పరిణామాలు ఎదురు అవుతాయి. ఈ కేసు వెనుక మూల కారణం, అందుకు బాధ్యులైన వ్యక్తులు ఆశ్చర్యం కలిగిస్తాయి. అతి క్లిష్టమైన ఈ కేసుని శేఖర్ ఎలా చేధించాడు అన్నదే గరుడ వేగ కధ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్లస్ పాయింట్ ఫస్టాఫ్, రాజశేఖర్ నటన, క్లైమాక్స్, గ్రాండ్ విజువల్స్,నిర్మాణ విలువలు. రాజశేఖర్ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. పదిహేనేళ్ల కిందట రాజశేఖర్‌ని తలపించేలా యాక్షన్ సీన్స్‌లో ఇరగదీశాడు. ఇంత యాక్షన్ వున్న సినిమాని ఓకే చేయడమే ఆయన తీసుకున్న మొదటి ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ లో రాజశేఖర్ గెలిచాడు. పూజాకుమార్, కిషోర్, శ్రద్ధ దాస్, అలీ, పోసాని కృష్ణ మురళి తమ పరిధిమేరకు రాణించారు. యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సన్నీలియోన్ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకుంటుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అంతేగాదు కొన్ని సీన్లు సాగదీశారు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి గరుడ వేగ కధకి సెంట్రల్ పాయింట్ ఎప్పుడైతే ప్రేక్షకులకి తెలిసిపోతుందో అప్పటినుంచి కథాగమనం మారిపోతుంది.అప్పటిదాకా భలే సినిమా చూస్తున్నాం అనే మూడ్ లో వున్న ప్రేక్షకుడు మళ్లీ మామూలు సినిమా చుస్తున్నామా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. రాజశేఖర్ నటనతో పాటు దర్శకుడి ప్రతిభకు వంక పెట్టలేం. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాకు మరో బలం. గ్రాండ్ విజువల్స్ సినిమాకు మరింత హైప్ తెచ్చాయి. సినిమా ఫస్టాప్‌ను దర్శకుడు అద్బుతంగా తీర్చిదిద్దాడు. అయితే సెకండాఫ్‌పై కాస్త దృష్టిపెడితే బాగుండేది. కోటేశ్వర రాజు నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.
తీర్పు:
చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రాజశేఖర్- ప్రవీణ్ సత్తారు చేసిన సరికొత్త ప్రయోగం గరుడవేగ. ఫస్టాఫ్, రాజశేఖర్ నటన,నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్ సినిమాకు మైనస్ పాయింట్స్. రాజశేఖర్ కి జీవన్మరణ సమస్యగా ఈ సమయంలో గరుడవేగ మంచి హిట్ ఇచ్చిందనే చెప్పాలి. మొత్తంగా డిఫరెంట్ జోనర్‌లో వచ్చిన నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ పిఎస్‌వి గరుడవేగ.
విడుదల తేదీ:03/11/2017
రేటింగ్:3/5
నటీనటులు : రాజశేఖర్, పూజ
సంగీతం: చరణ్ పాకల
నిర్మాతలు : కోటేశ్వర రాజు , మురళి శ్రీనివాస్
దర్శకత్వం : ప్రవీణ్ సత్తార్