ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత..

181
gantasala
- Advertisement -

ప్ర‌ముఖ గాయ‌కుడు, స్వ‌ర్గీయ ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ మృతిచెందారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ హాస్పిట‌ల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్న రత్నకుమార్…మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ర‌త్న‌కుమార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల కెరీర్ లో వేయికి పైగా త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ, సంస్కృత చిత్రాల‌కు డ‌బ్బింగ్ చెప్పారు. ప‌ది వేల‌కు పైగా త‌మిళ‌, తెలుగు టీవీ సీరియ‌ల్ ఎపిసోడ్స్ కు గాత్రాన్ని అందించారు.

ఎనిమిది గంట‌ల పాటు నిర‌వ‌ధికంగా డ‌బ్బింగ్ చెప్పి ఆయ‌న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు ద‌క్కించుకోగా అమేజింగ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్, తమిళ‌నాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ ఆయ‌న పేరు న‌మోదైంది. ఏపీ ప్ర‌భుత్వం నుండి బెస్ట్ మేల్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును అందుకున్నారు.

- Advertisement -