వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన గంటా..

293
ganta srinivasa rao
- Advertisement -

టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..? టీడీపీ ఓటమి తర్వాత గంటా స్టెప్ ఏంటీ..?అయన వైసీపీలో చేరడం లాంఛనమే ఇది కొద్దిరోజులగా ఏపీలో వినిపిస్తున్న వార్త..?ఈ నేపథ్యంలో తనపై వస్తున్న పుకార్లపై గంటా స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీని వీడే ప్రసక్తేలేదన్నారు.

తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్న ప్రజల నమ్మకమే తనను గెలిపించిందన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసమే కృషి చేస్తామని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

ఇంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడానికి గల కారణాలను పార్టీ సమావేశంలో విశ్లేషించుకుంటామన్నారు. పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపి 2024లో పార్టీ విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

1999లో రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా టీడీపీ తరపున అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009లో చిరంజీవి స్ధాపించిన పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత కిరణ్ కుమార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరపున విజయం సాధించారు.

- Advertisement -