నిధుల వినియోగంలో బాబు విఫలమైయ్యారు…

168

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదేళ్లలో కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు కొత్త ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాల ద్వారా బయటకొస్తాయని అన్నారు. ఇన్నాళ్లూ కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల గురించిన వాస్తవాలు బయటకు రాకుండా చంద్రబాబు తొక్కిపెట్టారని విమర్శించారు. అయిదేళ్ల పరిపాలనలో బాబు ఒక్క పోర్టు కూడా కట్టలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ పూర్తిస్థాయిలో సహకరిస్తుంది సోము వీర్రాజు అన్నారు.

BJP Leader Somu Veerraju

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధానిలో పేదల భూములు పేదలకు ఇవ్వాలని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీజేపీ నిర్మాణాత్మక సహకారం అందిస్తుంది. బీజేపీతో విడిపోయినప్పుడే టిడిపికి పతనం ప్రారంభమైందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కి ప్రత్యామ్నాయంగా మేము రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం..శాంతిభద్రతల విషయంలో కొత్త ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన తెలిపారు.