రవిశాస్త్రిపై గంగూలీ కామెంట్స్‌….నెట్టింట్లో వైరల్

528
ravishasthri ganguly
- Advertisement -

ఈ నెల 24న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు సౌరవ్ గంగూలీ. బీసీసీఐ అధ్యక్షుడిగా నామినేట్ అయిన తర్వాత తొలిసారి పశ్చిమ బెంగాల్‌కు విచ్చేసిన గంగూలీకి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు గంగూలీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రవిశాస్త్రి ఏం చేశాడని అతనితో మాట్లాడాలి అంటూ గంగూలీ చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత మూడేళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న బీసీసీఐను తిరిగి గాడిలో పెడతా..ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల సంక్షేమమే తొలి ప్రాధాన్యం…దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

2016లో భారత క్రికెట్‌ కోచ్‌ ఎంపిక జరిగినప్పుడు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సచిన్‌,లక్ష్మణ్‌తో పాటు కీలకంగా వ్యవహరించాడు గంగూలీ. ఆ సమయంలో రవిశాస్త్రిని రిజెక్ట్ చేసి కుంబ్లేను కోచ్‌గా ఎంపికచేశారు. దీనిపై అప్పట్లో గంగూలీపై రవిశాస్త్రి తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విరాట్..కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తడంతో కుంబ్లే కోచ్ పదవి నుంచి వైదొలగగా రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రిపై గంగూలీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisement -