రివ్యూ : రాజుగారి గది 3

784
rajugari gadi 3 review

అశ్విన్ బాబు,అవికాగోర్ ప్రధానపాత్రల్లో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజుగారి గది 3. రాజుగారి గది,రాజుగారి గది 2కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకురాగా ఈ సినిమాతో ఓంకార్ మరోసారి భయపెట్టాడా…?అశ్విన్‌ తన నటనతో ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడో చూద్దాం..

కథ..:

కేరళలో పేరు మోసిన మాంత్రికుడు గరడపిళ్లై కుమార్తె మాయా (అవికా గోర్‌). ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంటుంది. మాయ వెంబడి ఎవ్వరూ పడిన ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. ఇక అశ్విన్ ఓ ఆటో డ్రైవర్‌. సీన్ కట్ చేస్తే దెయ్యం చేతిలో చావుదెబ్బ తిన్న డాక్టర్ శశి( బ్రహ్మాజీ)….మాయను అశ్విన్‌ ప్రేమించేలా చేస్తాడు. ఈ క్రమంలో అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేంటీ…?దెయ్యం బారి నుంచి అశ్విన్ ఎలా భయటపడ్డాడు…?రాజుగారి గదిలో ఎలాంటి అనుభూతి ఎదురైందనేది తెరమీద చూడాల్సిందే.

Image result for rajugari gadhi 3

 

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఓంకార్ టేకింగ్,కామెడీ,కామెడీ,బ్యాక్‌గ్రౌండ్ సంగీతం. సోలో హీరోగా తొలి సినిమానే అయిన అశ్విన్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కామెడీతో పాటు లవ్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. అవికా తనకు అలవాటైన పాత్రలో ఒదిగిపోయింది. హీరో మామ పాత్రలో అలీ నటన సూపర్బ్. మిగితానటీనటుల్లో మలయాళ మాంత్రికుడిగా అజయ్‌ ఘోష్‌, రాజమాతగా ఊర్వశీ, బ్రహ్మాజీ, శివశంకర్‌ మాస్టర్‌, హరితేజ, ప్రభాస్‌ శ్రీను నవ్వులు పంచారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్,కథ, కథనం,పెద్దగా భయపెట్టే సన్నివేశాలు లేకపోవడం. సినిమాను హారర్‌ ఎలిమెంట్‌తో ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టిన దర్శకుడు తరువాత ఆ పాయింట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడిగా ఓంకార్‌ టేకింగ్‌ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి,ష‌బీర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాను బాగా ఎలివేట్‌ చేశాయి. ఎడిటింగ్ బాగుంది. బుర్ర సాయిమాధవ్‌ డైలాగ్‌లు సూపర్బ్. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for rajugari gadhi 3

తీర్పు:

రాజుగారి గది సీక్వెల్‌తో మరోసారి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఓంకార్ తెరకెక్కించిన చిత్రం రాజుగారి గది 3. కామెడీ,బ్యాక్ గ్రౌండ్ సంగీతం సినిమాకు ప్లస్ కాగా ఫస్టాఫ్,కథ మైనస్ పాయింట్స్‌. ఓవరాల్‌గా ప్రేక్షకులను అంతగా భయపెట్టకపోయిన కామెడీతో పర్వాలేదనిపించే మూవీ రాజుగారి గది 3.

విడుదల తేదీ:18/10/2019
రేటింగ్:2.5/5
నటీనటులు : అశ్విన్‌ బాబు, అవికా గోర్‌
సంగీతం : ష‌బీర్‌
నిర్మాణం : ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దర్శకత్వం : ఓంకార్‌