కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న రాజకీయ దాడులు, అశాంతిపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, కానీ భౌతిక దాడులకు దిగడం తాను తన రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి అకస్మాత్తుగా జరిగింది కాదని, అది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని గంగుల ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలిసే జరిగింది. ఆయన కనుసన్నల్లోనే ఈ విధ్వంసం సృష్టించారు అని గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమను మరియు బీఆర్‌ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసినప్పటికీ, కరీంనగర్ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని ప్రభుత్వ మరియు బీజేపీ వైఖరిని నిరసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని గంగుల విమర్శించారు. పోలీసుల దృష్టి కేవలం ప్రతిపక్ష నాయకులను అణచివేయడంపైనే ఉందని ఆయన ధ్వజమెత్తారు.
మమ్మల్ని అరెస్టు చేయడంలో పోలీసులు చూపించిన శ్రద్ధ, పెట్టిన ఫోకస్ కరీంనగర్ పట్టణ రక్షణపై పెట్టి ఉంటే.. ఇటీవల జరిగిన పీఎంజీ జువెలరీ (PMG Jewelry) రాబరీ జరిగేదే కాదు. నేరస్తులను పట్టుకోవడం మానేసి, రాజకీయ కక్షసాధింపులకు పోలీసులు సహకరిస్తున్నారు అని ఆరోపించారు.
Also Read:దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం..సోమనాథ్ ఆలయం

