నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం

157
gangula
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసి, టిఎస్ టిఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ద్రువీకరణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఇదే అంశంపై రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,15,901 అప్లికేషన్ల విచారణ తుదిదశకు చేరుకుందని, అత్యంత త్వరలోనే లబ్దీదారులను గుర్తించి వీలైనంత త్వరగా వారికి కార్డులతో పాటు రేషన్ ఒకేసారి అందించే విదంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.

గత పదిహేను రోజులుగా జిల్లా స్థాయిలో రెవెన్యూతో పాటు ఇతర సిబ్బంది, రాజదానిలో జిహెచ్ఎంసీతో పాటు ఇతర సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రతీ అర్హుడిని గుర్తించడం కోసం జిల్లా కలెక్టర్లు, డిసిఎస్వోలు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. నూతన కార్డుల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడినా సిద్దంగా ఉన్నామని, గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రతీ పేదవాని ఆకలిని తీర్చడానికే నిరంతరం క్రుషిచేస్తారన్నారు మంత్రి గంగుల కమలాకర్.

కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Advertisement -