కరోనా నుండి కోలుకున్న మాఫియా డాన్ చోటా రాజన్..

67
Gangster Chota Rajan

ఇటీవల కరోనా బారినపడిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ (61) చనిపోయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కరోనా చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు మీడియాలో వార్తలు రావడంతో, పోలీసు వర్గాలు చోటా రాజన్‌ బతికే ఉన్నట్లు స్పష్టతనిచ్చాయి. కాగా, మాఫియా డాన్ కరోనా నుండి తిరిగి కోలుకున్నాడు. ఏప్రిల్ 22న చోటా రాజన్ కు ఢిల్లీలోని తీహార్ జైల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

దాంతో చికిత్స కోసం చోటా రాజన్ ను ఏప్రిల్ 24న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తాజాగా చోటా రాజన్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. దాంతో అతడిని తిరిగి తీహార్ జైలుకు తీసుకువచ్చినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. కాగా, చోటా రాజన్ పెద్ద సంఖ్యలో కేసులు ఎదుర్కొంటున్న చోటా రాజన్ ను 2015లో ఇండోనేషియాలో అరెస్ట్ చేశారు.