బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై గంగవ్వ షాకింగ్‌ కామెంట్స్‌..

221
Gangavva

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. సీజన్ 4కి యాంకర్‌గా మారిన విషయం తెలిసిందే. ‘బిగ్ బాస్ 4 బజ్’‌లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందర్నీ రాహుల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా గంగవ్వను ఇంటర్వ్యూ చేశాడు రాహుల్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన అనంతరం బిగ్ బాస్ హౌస్ ఇంటి పరిస్థితుల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది గంగవ్వ. ఈ ఇంటర్వ్యూలో రాహుల్‌ ర్యాపిడ్ ఫైర్ క్వచ్ఛన్స్ ఇచ్చాడు. వాటికి అవ్వ తిమ్మతిరిగే సమాదానాలు ఇచ్చి.. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. గంగవ్వపై లేని ప్రేమ చూపిస్తూ సింపథీ ఓట్లు పొందడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో చాలామంది పోటీ పడ్డారు. అయితే వీళ్ల దొంగ ప్రేమను బట్ట బయలు చేసింది గంగవ్వ.

రాహుల్ ప్రశ్న: హౌస్ ఎవరికి కోపం ఎక్కువ? సొహైల్/ మెహబూబ్
గంగవ్వ సమాధానం: కెప్టెన్ అయ్యిండు సూడు.. సొహైల్ ఆయనకే కోపం.

రాహుల్ ప్రశ్న: ఈ ఇంట్లో ఉండటానికి ఎవరికి అర్హత లేదు?
గంగవ్వ సమాధానం: హారికకు హౌస్‌లో ఉండే అర్హత లేదు. దానిలోకంలో అది ఉంటుంది.. కోపంగా ఉంటాది.

రాహుల్ ప్రశ్న: వీరిద్దరిలో ఎవరు బాగా నవ్విస్తారు? అవినాష్/అమ్మా రాజశేఖర్
గంగవ్వ సమాధానం: అనినాష్

రాహుల్ ప్రశ్న: ఇంట్లో ఎవరి జంట బాగుంది?
గంగవ్వ సమాధానం: అఖిల్-మోనాల్ జంట బాగుంది.

రాహుల్ ప్రశ్న: నీకు అఖిల్-దివి ఇద్దరిలో ఎవరితో ఎక్కువ ఉండటం ఇష్టం?
గంగవ్వ సమాధానం: నాకు అఖిల్‌తో ఉండటమే ఇష్టం.

రాహుల్ ప్రశ్న: హౌస్‌లో మాస్క్ లేకుండా నేచురల్‌, జన్యూన్‌గా ఉండేది ఎవరు?
గంగవ్వ సమాధానం: కుమార్ సాయి.. నిజాయితీగా ఆటాడతాడు.. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు.. ఫేక్‌గా ఉండడు.

రాహుల్ ప్రశ్న: నీకు అఖిల్ అంటే ఇష్టం కదా?? కుమార్ సాయిని జన్యూన్‌ అంటున్నావ్??
గంగవ్వ సమాధానం: ఇష్టం అయితే?? మనవడంటే ఇష్టం ఉన్నా మంచోడు కాకుండా మంచోడని చెప్పుకుంటామా?? ఆడడు.. ఓడడు నిజాయితీ ఉండడు.. అలా ఉంటే ఉందని చూపిస్తారు. కాని కుమార్ సాయి ఆట ఆడితే నిజాయితీగా ఆడతాడు. అఖిల్ నా కాళ్లు ఒత్తాడని మంచోడు కాకపోయిన మంచోడని చెప్తే నాకు విలువ ఉంటుందా? ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలే.. నేను ఇంట్లో అయినా అంతే బయట అయినా అంతే’ అంటూ కుండబద్దలు కొట్టినట్టు ఆన్సర్లు ఇచ్చింది గంగవ్వ.అయితే అఖిల్ విషయంలో గంగవ్వ సమాధానం విని.. నీ నుంచి ఈ సమాధానం ఊహించలేదు గంగవ్వా.. మస్త్ చెప్పినావ్.. కరెక్ట్ సమాధానం ఇచ్చినవ్’ అంటూ గంగవ్వను ప్రశంసించాడు రాహుల్ సిప్లిగంజ్.