టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌..

228
csk

మంగళవారం దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర మ్యాచ్ మొదలుకానుంది. రాత్రికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. జగదీశన్‌ స్థానంలో పియూశ్‌ చావ్లాను తుది జట్టులోకి తీసుకున్నట్లు ధోనీ వెల్లడించాడు. మరోవైపు యువ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ స్థానంలో షాబాజ్‌ నదీమ్‌ జట్టులోకి తీసుకున్నట్లు హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో గెలుపు రెండు జట్లకు అత్యవవరం. ఇప్పటివరకు సీఎస్‌కే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 2 మాత్రం గెలిచి టెబుల్‌లో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. మిడిలార్డర్‌‌ వైఫల్యం చెన్నైకి ప్రతికూలంగా మారింది. ఇక సన్‌‌రైజర్స్ కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. టెబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటినుంచి అన్ని మ్యాచ్‌లు గెలుస్తునే ఫ్లే ఆప్‌కు అవకాశాలు ఉంటాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో , మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్‌

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, షార్దుల్ ఠాకూర్, కరుణ్ శర్మ