హైదరాబాద్ నగరంలో ఇవాళ గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు మద్యం దుకాణాలను బంద్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ గణేష్ నిమర్జన శోభాయాత్ర మొదలుకానుంది. గణనాథుల నిమజ్జనం కోసం అధికారులు 21 క్రేన్లను సిద్ధం చేశారు.
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఉదయం 11 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3గంటలకు పూర్తి కానుందని ఉత్సవ సమితి నాయకులు తెలిపారు. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నెం.4 దగ్గర నిమజ్జనం కానుంది.
భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ గణెష్ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితీ నాయకులు పేర్కొన్నారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్లకు వెళ్లేవారు నిమజ్జన యాత్ర గుండా వెళ్లొదని, ప్రత్నామ్నాయదారుల గుండా వెళ్లాలని పోలీసులు సూచించారు.