అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి

1
- Advertisement -

ముంబైలోని అంబానీ నివాసం ‘యాంటిలియా’లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సందడి చేశారు. అయితే బయట ఉన్న మీడియా, ఫోటోగ్రాఫర్ల (పారాపాజీ) ముందుకు రాకుండా చాలా నిశ్శబ్దంగా లోపలికి వెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.

బయట మీడియా కెమెరాలకు షారుఖ్ చిక్కకపోయినప్పటికీ, అంబానీ నివాసం లోపల ఆయన ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ ఫ్యాన్ క్లబ్ షేర్ చేసిన ఒక ఫోటోలో ఆయన ముకేశ్ అంబానీ, నీతా అంబానీలతో కలిసి చిరునవ్వుతో పోజులిచ్చారు. ఈ వేడుక కోసం తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించిన షారుఖ్, కొత్త హెయిర్ కట్‌తో (షార్ట్ హెయిర్‌స్టైల్) చాలా సింపుల్‌గా, రాయల్‌గా కనిపిస్తున్నారు.

మరోవైపు ఆయన భార్య గౌరీ ఖాన్ తన తల్లితో కలిసి అంబానీ నివాసానికి చేరుకోగా, ఎంట్రెన్స్ వద్ద ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. సోషల్ మీడియాలో ‘ఆస్క్ ఎస్‌ఆర్‌కే’ (AskSRK)అంబానీ వేడుకలకు ముందు షారుఖ్ ఖాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో ‘AskSRK’ సెషన్ నిర్వహించారు. తన ఇంట్లో వినాయక చవితి సంబరాలు ఎలా జరుగుతాయో వివరిస్తూ.. తమ ఇంట్లో 1.5 రోజుల పాటు బాప్పా (గణనాథుడిని) కొలువుదీరుస్తామని, తన భార్య గౌరీ హారతి, పూజలు నిర్వహిస్తుందని చెప్పారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ప్రార్థనలు చేస్తామని వెల్లడించారు.

Also Read;సూర్య–జ్యోతిక..మళ్లీ పెళ్లి

ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తదితరులు అంబానీ నివాసానికి వచ్చి వినాయకుడి ఆశీస్సులు తీసుకున్నారు.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న ‘కింగ్’ (King) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కానుంది.

- Advertisement -