- Advertisement -
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమాచార భవన్లో కొవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గాంధీ మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. అనిల్ కుమార్, యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డా. సాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు పలు సలహాలు సూచనలు చేశారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఎంతో ఉపయోగపడింది.ఇతర దేశాలు భారత్లో కరోనాను కట్టడి కష్టం అన్నారు కానీ.. వ్యాప్తిని నివారించగలిగాం.భౌతిక దూరం పాటించడం,వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాను అరికట్టొచ్చు. రాష్ట్రంలో కేసులు తగ్గుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాదు. కరోనా విషయంలో అతి భయం,అతి నిర్లక్ష్యం రెండు ఉండొద్దు.జలుబు,దగ్గులాంటివి ఉంటే కరోనా ఉన్నట్టు కాదు అని డాక్టర్లు అనిల్ కుమార్, సాయిరెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -