- Advertisement -
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా ఈ ఉద్యోగితో కలిసిమెలిసి తిరిగిన వారి సంఖ్య 88 అని ఆరోగ్య శాఖ నిర్ధారించింది.
ఈ నేపథ్యంలో 45 మందిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాగా…వీరికి కరోనా వైరస్ సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. వీరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని వెల్లడించారు. వీరంతా 14 రోజుల పాటు బయటకు రాకుండా తమ నివాసాల్లోనే ఉండాలని సూచించినట్లు డాక్టర్లు చెప్పారు.
ఇక గాంధీ ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితుడికి చికిత్స అందిస్తున్న వైద్యుడికి కూడా ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. వైద్యుడి రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు.
- Advertisement -