గేమింగ్ ఇండస్ట్రీతో ఉపాధి అవకాశాలు..

166
Gaming Industry to create employment
- Advertisement -

యానిమేషన్ –  గేమింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ షోను ప్రారంభించిన కేటీఆర్ టెక్నాలజీ జీవితంలో భాగమైపోయిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ – యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. దేశంలో సగం జనాభా 27 సంవత్సరాల లోపు ఉన్నవారేనని కేటీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో గేమింగ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్ ఉందన్నారు. గేమింగ్, మల్టీమీడియా రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాలసీ తీసుకువచ్చిందని చెప్పారు.

హైదరాబాద్‌లో ప్రతీ సంవత్సరం గేమింగ్ షో నిర్వహించాలని కేటీఆర్ కోరారు. గేమింగ్, విజువల్ ఎఫెక్ట్, మల్టీమీడియా రంగాల అభివృద్ధికి ఇమేజ్ టవర్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గేమింగ్ సెక్టార్ తెలంగాణ యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని ఆశిస్తున్నానని మంత్రి అన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ షోలో 24 గేమింగ్ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రదర్శనలో వివిధ సంస్థలకు చెందిన వీడియో గేమ్‌లను ప్రదర్శించారు. ఈ షో రెండు రోజుల పాటు జరగనుంది.

- Advertisement -