రామ్‌ చరణ్‌…రంగస్థలం ఫస్ట్ లుక్

213
First look of Ram Charan-Sukumar’s Rangasthalam released
- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్ధలం 1985. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రామీణ కథా నేపథ్యంగా తెరకెక్కుతోంది. ఎంతోకాలంగా సినిమా ఫస్ట్ లుక్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు రంగస్థలం యూనిట్ సర్ ప్రైజ్‌నిచ్చింది.

రామ్ చరణ్ తన ఫేస్‌ బుక్‌ ద్వారా సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. రంగస్థలంలోని ‘చిట్టిబాబు’ను 2018 మార్చి 30న కలవండి!’ అని చెర్రీ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ద్వారా ‘రంగస్థలంలో’ చిట్టిబాబు పాత్రను చరణ్ పోషిస్తున్నట్టు స్పష్టమైంది.

పీరియడిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్‌, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిమాకు సంబంధించి ఇప్పటికే 35 కోట‍్లకు పైగా బిజినెస్‌ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది.

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల వాయిదాపడింది. పవన్‌ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుండటంతో అబ్బాయ్ వెనక్కి తగ్గాడు.

- Advertisement -