మావోలపై గంభీర్‌ ట్వీట్‌ తూటా

191
Gambir on killing of 25 CRPF troopers
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జవాన్లపై పాశావికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 25 మంది జవాన్లు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. జాతి మొత్తం జవాన్ల ఆత్మకు శాంతి చేకురాలని.. మావోల దాడిని ఖండించారు. తాజాగా మావోల దాడిపై క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ ఘాటుగా స్పందించాడు. మావోలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్ఘాటించాడు.

‘ఛత్తీస్‌గఢ్‌, కశ్మీర్‌, ఈశాన్యం. మనకు ఇంకా ప్రమాద ఘంటికలు అవసరమా? లేదంటే మనం చెవులు వినిపించని స్థితిలో ఉన్నామా? నా దేశ ప్రజల ప్రాణాలు విలువలేనివి కావు. దీనికి ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే’ అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. కశ్మీర్‌లో ఆందోళన కారులు జవాను చెంపపై కొట్టినప్పుడు ‘నా జవాన్‌పై పడ్డ ప్రతి దెబ్బకు కనీసం 100 జిహాదీల ప్రాణాలు పోతాయి. ఆజాదీ కావాలనుకొనేవారు వెళ్లిపోండి. కశ్మీర్‌ మాది’ అని స్పందించిన సంగతి తెలిసిందే.

gambir

మరోవైపు ఐపీఎల్‌లో  ధోనీ పేలవ ప్రదర్శన చేస్తున్నాడన్న విమర్శలకు సమాధానమిచ్చాడు గంభీర్. ఒకటి రెండు ప్రదర్శనల ఆధారంగా ధోనీని విమర్శించడం తగదని, భారత క్రికెట్‌కు అతను అందించిన సేవలు మర్చిపోకూడదని చెప్పాడు. బ్యాటింగ్‌లో మొదలుపెట్టే వాళ్లు, ముంగించే వాళ్లు ఎవరు ఉండరు, గెలుపుకు కారణమయ్యే పరుగులు చేసేవాళ్లే అసలైన ఫినిషర్లు. అది ఓపెనర్ అయినా 11వ నెంబర్ బ్యాట్స్‌మన్ అయినా ఎంత కీలక పాత్ర పోషించారన్నదే ముఖ్యమని తెలిపాడు.

- Advertisement -