టెన్షన్ లో రాజమౌళి!

235
Rajamouli Tension on Baahubali 2
- Advertisement -

మరో రెండు రోజులలో బాహుబలి2 సినిమా విడుదల కానుండడంతో కెప్టెన్ ఆఫ్ ది షిప్ రాజమౌళి చాలా టెన్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సెకండ్ పార్ట్ లోనే పూర్తి విషయాన్ని చెప్పనుండడంతో బాహుబలి 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే సినిమా విడుదలవుతోందంటే .. ఆ సినిమాకి సంబంధించిన టీమ్ కి టెన్షన్ ఉంటుంది. తాము పడిన కష్టానికి ఫలితం ఎలా వుంటుందోననే ఆత్రుత వాళ్లందరిలోను ఉంటుంది. ఆ సినిమాపై ఎంతగా అంచనాలు ఉంటే .. అంతగా ఆ టీమ్ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. చూడటానికి కూల్ గా కనిపిస్తారు గానీ, రాజమౌళి కూడా టెన్షన్ పడతారని ఆయన సతీమణి రమ చెప్పారు.

వినయంతో పద్ధతిగా కనిపించే రాజమౌళికి గర్వపడటం .. టెన్షన్ పడటం వుండవనుకుంటారనీ, ఆయనకి ఆ రెండూ ఉన్నాయని అన్నారు.  సినిమా విడుదల సమయంలో సహజంగానే ఆయన టెన్షన్ పడతారనీ, అంతకన్నా ఎక్కువగా తాను ఆందోళన చెందుతానని అన్నారు.

మరోవైపు టెన్షన్‌ నుంచి భయటపడేందుకు చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న జక్కన్న…అనుష్కపై ప్రశంసలు గుప్పించారు. అనుష్కకి అంకితభావం ఎక్కువనీ .. పాత్రలో ఒదిగిపోవడం కోసం ఆమె ఎంత కష్టమైనా పడుతుందని ఆయన అన్నారు.ఆమె రూపంలో రాజసం ఉట్టిపడుతూ వుంటుందనీ, అందుకే ‘దేవసేన’ పాత్రకి ఆమెను మాత్రమే అనుకున్నానని అన్నారు.రమ్యకృష్ణ .. నాజర్ .. ప్రభాస్ .. రానాలతో పోటీపడి ఆమె నటించడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.

- Advertisement -