నిత్యా గమనం ఫస్ట్ లుక్‌!

170
nithya menon

రియ‌ల్ లైఫ్ డ్రామాగా సుజ‌నా రావు డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘గ‌మ‌నం’. శ్రియా, నిత్యా మీనన్ ప్రధానపాత్రలో సినిమా తెరకెక్కుతుండగా ఇటీవల విడుదల చేసిన శ్రియ లుక్‌కి మంచిరెస్పాన్స్ వచ్చింది. తాజాగా నిత్యామీనన్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నిత్య మీనన్ జస్ట్ స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తుంది. ఈ లుక్ ను హీరో శర్వానంద్ ఈ రోజు రివీల్ చేశారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్నారు.సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాత అవ‌తారం కూడా ఎత్తి, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.