అమరుల త్యాగం మరువలేనిది: మంత్రి వేముల

225
Vemula Prashanth Reddy

నేడు అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగం మరువలేనిది. అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఉద్యమ అమరుల స్మారకర్ధం స్మారక చిహ్నంను ఏర్పాటు చేస్తున్నాం. స్మారక చిహ్నం 2 లక్షల స్క్వేర్ ఫీట్లలో కడుతున్నామని.. స్మారక చిహ్నంలో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, తెలంగాణ తల్లి విగ్రహం, పార్కింగ్ సదుపాయం, కన్వేన్షన్ హల్, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామని.. 6 నెలలో ఈ స్మారక చిహ్నం పూర్తి చేస్తాం అని మంత్రి తెలిపారు.

అలాగే డిసెంబర్ లోగా లక్ష ఇళ్ళు పూర్తి చేస్తాము.కేంద్ర ప్రభుత్వం కట్టే ఇళ్లతో పోల్చితే… మా ఇళ్ళు 5 ఇండ్లతో సమానం.భట్టి విక్రమార్కకి అనుమానం వచ్చినట్టు ఉంది అందుకే తిరిగుతున్నాడు. భట్టి విక్రమార్కకు నిద్ర పోయిన కూడా మా డబుల్ బెడ్ రూమ్ లు కనపడుతున్నాయి. హామీ ఇచ్చినట్లుగా భట్టి విక్రమార్కకు లక్ష ఇండ్లు చూపిస్తామని మంత్రి వేముల పేర్కొన్నారు.