టాలీవుడ్ స్టార్ హీరోలలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలుగా వచ్చారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఇప్పుడు వారసులతో కిటకిటలాడుతోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి కుటంబ వారసులే ఇప్పుడు పరిశ్రమను ఏలుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హీరో వచ్చి చేరబోతున్నాడు.
సూపర్‌స్టార్ కృష్ణ కూతురు పద్మావతి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ల పెద్ద కుమారుడు గల్లా అశోక్ త్వరలో వెండితెర మీద సందడి చేయనున్నాడు. అందమైన వర్చస్సు – ఆకట్టుకునే కళ్లు – స్పూరద్రూపంతో తెరమీదకు వచ్చేస్తున్నాడు. ఈ కుర్ర హీరో ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే… ఆయనకు పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. గల్లా యువ సైన్యం పేరుతో ఈ అభిమానుల బృందం ఏర్పడింది. ఈ అభిమాన బృందమే త్వరలో తమ అందగాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రకటించింది. ఈ సినిమాను గల్లా జయదేవ్.. తమ సొంత బ్యానర్లోనే నిర్మించబోతున్నట్టు సమాచారం.
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్తగా మహేష్ బావ సుధీర్‌బాబు, నరేష్ కుమారుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జయదేవ్ కొడుకు అశోక్ ఆ కుటుంబం నుంచి మూడో హీరోగా ఎంట్రీగా ఇవ్వబోతున్నాడన్న మాట.
మహేష్ అన్నయ్య రమేష్ బాబు కొన్ని సినిమాల్లో కూడా హీరోగా నటించి, ఆ తర్వాత కనుమరుగై పోయాడు. ప్రస్తుతం వ్యాపారంలో బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు సినిమాల నిర్మాణంలో కూడా రమేష్‌బాబు భాగస్వామిగా ఉంటున్నాడు. మొత్తంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధం కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.