పెద్ద నోట్ల రద్దు సాహసోపేత నిర్ణయం..

235
Kcr on Currency Ban
- Advertisement -

పెద్ద నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం అసాధారణమైందని…ఇంతపెద్ద నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. శాసనమండలిలో పెద్ద నోట్ల రద్దుపపపపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాని స్పష్టం చేశారు.  నోట్ల రద్దు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితి గురించి అందరికి తెలుసన్నారు. పెద్ద నోట్ల రద్దు దేశంలోని 29 రాష్ట్రాలకు సంబంధించిందన్నారు. ఏమి తెలియనట్టు నటించి ఆత్మ వంచన చేసుకోవద్దన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 50 రోజులు గడువు కావాలని కోరారని సీఎం గుర్తుచేశారు.

అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో….తెలంగాణలో అదే జరుగుతుందన్నారు సీఎం. మన్మోహన్ సింగ్ కూడా డీమానిటైజేషన్‌ చేయాలనుకున్నట్లు సీఎం సభకు తెలిపారు. గతంలో ఏ ప్రధానమంత్రి తీసుకోని నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారని తెలిపారు. మోడీ తీసుకున్న నిర్ణయం ఒక్క నోట్ల రద్దుతో ఆగదని….బ్లాక్ మనీ ఏ రూపంలో ఉన్న బయటకు వస్తుందన్నారు. నల్లధనం రూపంలో ఉన్న బంగారం,వెండి,వజ్రాలు అన్ని బయటికి వస్తాయని తెలిపారు. బంగారం ఎన్ని రూపాల్లో ప్రజల దగ్గర ఉంటుందో ప్రధానికి వివరించినట్లు తెలిపారు.

విదేశీ కరెన్సీ,బినామీ ఆస్తులు,బంగారం కడ్డీలను,బిస్కెట్లను మాత్రమే గుంజుకుంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. మహిళల దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుంటామంటే…తెలంగాణ ఉద్యమమంతా ఉద్యమాన్ని లేవదిస్తానని తెలిపారు. ప్రధానితో 70 నిమిషాలు మాట్లాడనని….దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేశారన్నారు. త‌న ద‌గ్గ‌రున్న‌ న‌ల్ల‌ధ‌నాన్ని మార్చుకోవ‌డానికే ప్ర‌ధాని మోడీని తాను క‌లిశానని కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ లాంటి వారు అన్నార‌ని కేసీఆర్ చెప్పారు. ఈ స‌మ‌యంలో ష‌బ్బీర్ అలీతో స‌హా స‌భ‌లో ఉన్న‌వారంతా చిరున‌వ్వులు చిందించారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అందరికి ఇబ్బందులు తలెత్తాయని…ముఖ్యంగా రాజకీయ నాయకులపై ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడిందన్నారు.1985లో మా కుటుంబానికి ఎంత బంగారం ఉందో అఫిడవిట్ ఇచ్చానని సీఎం తెలిపారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని సభకు చెప్పారు. నల్లధనం వెలికితీస్తేనే దేశం బాగుపడుతుందన్నారు.

మంచి జరుగుతుందంటే…ఎందుకు వ్యతిరేకించాలని సీఎం సూచించారు. మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. సర్వేల్లో కూడా ఇదే విషయం వెల్లడవుతుందన్నారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే వేచి చూడటంలో తప్పులేదన్నారు. ప్రధానమంత్రి 50 రోజుల సమయం అడిగారని….తర్వాత పరిస్థితిలో మార్పురాకపోతే తిరుగుబాటు చెద్దామన్నారు. నగదు రహిత సమాజం అనేది అలుపెరగని ప్రక్రియన్నారు.

- Advertisement -