ఖైదీ ఆడియో ఫంక్షన్ లేనట్టే..?

102
Chiranjeevi

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150. దాదాపు ఎనిమిది ఏళ్ల తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ తెగ సందడి చేస్తోంది. కేవలం నాలుగు గంటల్లో 10లక్షల వ్యూస్ వచ్చాయంటే సినిమాపై ఎంత క్యూరియాసిటీతో ఉన్నారో అర్దం అవుతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తీ కావడంతో..అభిమానులు ఇక ఆడియో వేడుక కోసం వేయి కళ్ల తో ఎదురుచూస్తున్నారు. చిరు 150వ సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని మెగా అభిమానులంతా ఉత్సహంతో ఉన్నారు. ఈ సమయంలో మెగా అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ గత చిత్రాలు సరైనోడు, ధృవ మాదిరిగానే ఖైదీ నంబర్ 150కి ఆడియో ఫంక్షన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi

చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రంలోని ‘అమ్మడు..’ అనే పాటను రేపు సాయంత్రం విడుదల చేస్తున్నారు. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా డ్యాన్స్‌ చేస్తున్న చిరు పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. రేపు ఓ సాంగ్‌ ను రిలీజ్ చేసి ఆ తర్వాత ఈ నెల 25న ఆడియోను మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నామని, జవనరి తొలివారంలో ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహిస్తున్నామని ట్వీట్‌ చేసింది. దీంతో ఇక ఆడియో వేడుక లేనట్టేనని స్పష్టమైంది.

సెంటిమెంట్ పరంగా కూడా ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇది మెగా అభిమానులకు కాస్త చేదులాంటి వార్తే అయినా..రేపు సాంగ్ రిలీజ్ కానుండడంతో జోష్‌ తో వెయిట్ చేస్తున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. సురేఖ కొణిదెల చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.