గాలి జనార్ధన్‌రెడ్డి… పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకలో మైనింగ్ సామ్రాజ్యానికి అధిపతిగా, బళ్లారి బాబుగా ఓ వెలుగు వెలిగిన గాలి జనార్ధన్‌రెడ్డి ఒకప్పుడు రాజభోగాన్నే అనుభవించారు. బంగారు కంచాలలో తింటూ, బంగారు గ్లాసుల్లో నీళ్లు తాగే ఈ బంగారు బాబు…శ్రీవారికి 40 కోట్ల విలువైన బంగారు కీరిటాన్ని చేయించిన సంగతి తెలిసిందే.
అయితే,కొన్నాళ్ల తర్వాత చిక్కులు తప్పలేదు. అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఇటీవలే గాలి బెయిల్ మీద విడుదలయ్యారు. కొద్దిరోజుల క్రితమే గాలి జనార్ధన్‌రెడ్డి కూతురికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కార్డుల దగ్గర్నుంచి వేదిక దాకా అన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారట. తాజాగా గాలి జనార్థనరెడ్డి కూతురికి సంబంధించిన పెళ్లి కార్డ్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
నవంబర్‌లో ఈమె పెళ్లి రాజీవ్ రెడ్డి అనే వ్యక్తితో జరగనుండగా, అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా చూడని విధంగా గాలి జనార్థన్ రెడ్డి కూతురు పెళ్లి ఆహ్వాన పత్రికను తయారు చేశారు. ఓ బాక్సులో ఎల్‌సీడీ స్క్రీన్‌ను అమర్చి అందులో గాలి జనార్థన్ రెడ్డి కూతురుతో సహా కుంటుబ సభ్యులంతా ఆ వీడియోలో కనిపిస్తారు. తమ కూతురుని ఆశ్వీరదించడానికి అంతా రావాలి అంటూ అంతా పాటలు పాడి మరి ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, ఈ వివాహానికి పలువురిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది.
ఈ వీడియో ఇన్విటేషన్ ను యూట్యూబ్ లో ఉంచారు. రూ.వందల కోట్లు వెచ్చించి ఈ పెళ్లి జరుపనున్నట్లు గాలి జనార్థన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. నవంబర్ లో జరిగే ఈ పెళ్లి వేడుకకు దేశంలో ఉన్న ప్రముఖులందర్నీ ఆహ్వానించనున్నారు.
అక్రమంగా గనుల వ్యాపారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డి మూడేళ్లపాటు జైళ్లో ఉన్నారు. గతేడాది బెయిల్ పై విడుదలయ్యారు.2011 వరకు యాడ్యూరప్ప (బీజేపీ)ప్రభుత్వంలో గాలి జనార్థన్ రెడ్డి ఆయన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డిలు మంత్రులుగా పనిచేశారు.
https://youtu.be/vycIg7ltYSM
https://youtu.be/yWH0WPAbRlo