నారాయణపేట కలెక్టర్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు..

643
Narayanpet collector
- Advertisement -

నారాయణపేట జిల్లా కలెక్టర్ హరి చందనపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో నారాయణపేట కలెక్టర్ హరి చందన చేపట్టిన మొబైల్ షి టాయిలెట్ వినూత్న ఆలోచన ప్రశంసనీయమైనదని కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ గొప్ప చొరవ మహిళలకు సౌలభ్యం, భద్రతను అందించడమే కాకుండా బయో డైజస్టర్స్ అమర్చిన మరుగుదొడ్ల ద్వారా స్థిరత్వాన్ని అందిస్తుంది అయన తెలిపారు.

- Advertisement -