బల్దియా పీఠం టీఆర్ఎస్ కైవ‌సం..

207
trs
- Advertisement -

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా పీఠాన్ని టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నిక‌య్యారు. ఆమె బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఆమెను సభ్యులు ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిని స‌భ్యులు ఎన్నుకున్నారు. ఆమె తార్నాక నుంచి గెలుపొందారు. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ను పీవో శ్వేతా మ‌హంతి ప్ర‌క‌టించారు.మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎంఐఎం మ‌ద్ద‌తు తెలిపింది. ఎట్టకేలకు టీఆర్ఎస్ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పీఠాల‌ను కైవ‌సం చేసుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబ‌రాలు జరుపుకుంటున్నారు.

మేయ‌ర్ ప్రొఫైల్ :

గద్వాల విజయలక్ష్మి(బంజారాహిల్స్‌)
వయస్సు: 56
భర్త: బాబీరెడ్డి
విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ
కులం: మున్నూరు కాపు (బీసీ)
రాజ‌కీయ అనుభం: 2016లో బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి అదే డివిజన్‌ నుంచి గెలుపొందారు.

డిప్యూటీ మేయ‌ర్ ప్రొఫైల్ :

మోతె శ్రీలత(తార్నాక‌)
వయస్సు: 49
భర్త: మోతె శోభన్‌రెడ్డి
పిల్లలు: రాజీవి, శ్రీతేజస్వి
విద్యార్హత: బీఏ
వృత్తి : 20 ఏండ్లుగా బొటిక్ నిర్వ‌హ‌ణ‌
రాజకీయ అనుభవం: కొంతకాలంపాటు టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

- Advertisement -