రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి గద్వాల్ పట్టణంలోని ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో మొక్కలు నాటారు మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్.
అనంతరం చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ గారు హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తో ఒక్కరితో మొదలు పెట్టి దేశ వ్యాప్తంగా విస్తరించి ముందుకు తీసుకెళ్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఇండోర్ స్టేడియం ప్రాగణంలో మొక్కలు నాటారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా మారుస్తుందన్నారు.
ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు గ్రీన్ ఛాలెంజ్ లాంటి కార్యక్రమాలను చేపట్టి మొక్కలు నాట్టే కార్యక్రమన్ని ముందుకు తిసుకున్ని వెళ్తుతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరో ముగ్గురు ( RDO రాములు , జహూర్ , కరాటే శ్రీహరి ) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించాలని చైర్మన్ కేశవ్ కోరారు.