చిరు.. ‘గాడ్‌ ఫాదర్‌’లో గద్దర్..!

184
gaddar
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా సూపర్ హిట్టైన ‘లూసీఫర్’రీమేక్‌గా తెరకెక్కుతుండగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ పతాకాల‌పై ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మాత‌లుగా రూపొందుతోంది.

తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రజాగాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే షెడ్యూలులో ఈ పాత్రకు సంబంధించిన దృశ్యాలను విశాఖ సెంట్రల్ జైలులో చిత్రీకరిస్తారట.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింద. టైటిల్ లుక్‌ లో కోటు వేసుకుని, టోపి పెట్టుకుని చేతిలో గ‌న్ పెట్టుకుని చిరంజీవి వెన‌క్కి తిరిగి ప‌క‌క్కు చూస్తూ నిట‌బ‌డి ఉన్నారు. గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్‌లో ఏ అనే అక్ష‌రాన్ని మ‌ధ్య‌లో చేత గ‌న్ ప‌ట్టుకుని చిరంజీవి నిల‌బ‌డి ఉండ‌టాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ రీమేక్ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -