‘గూడాచారి’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న అడివి శేష్ రెండవ భాగం G2 కి శ్రీకారం చుట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా విడుదలైన ప్రీ-విజన్ వీడియోకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. హైదరాబాద్‌లో కూడా యూనిట్ మీడియాతో మాట్లాడింది.
అడివి శేష్ మాట్లాడుతూ – ”గూఢచారి సౌత్ ఇండియన్ స్పై సినిమాల ట్రెండ్‌ని మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మేము దీనికి G2తో ఫ్రాంచైజీగా చేయబోతున్నాము. కొత్త దర్శకుడు వినయ్‌కి మంచి విజన్ ఉంది, కథకు న్యాయం చేస్తాడు. నేను ఏది అడిగినా ఇచ్చే నిర్మాతలు నాకు దొరికారు” అన్నారు.
“గూఢచారి సినిమా నుండి మనం ఆశించే దాని నుండి G2 తదుపరి స్థాయి యాక్షన్ ఉంటుంది. నా డైరెక్టర్ కోరుకున్నట్లుగా సిక్స్ ప్యాక్ పూర్తి చేసిన తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఇండియా అనే ఐదు దేశాల్లో ఈ సినిమాను ఘాట్ చేయబోతున్నాం . G2 ఎలా ఉంటుందో ప్రేక్షకులకు రుచి చూపించేందుకే మేము ప్రీ-విజన్ వీడియోని రిలీజ్ చేశాం. 2024లో జి2తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాం’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి…